కొడంగల్లో పెరుగుతున్న కరోనా కేసులు గ్రామాల్లోకి వ్యాప్తి చెందే అవకాశం

వికారాబాద్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది .తాజాగా కొడంగల్ మండలంలో శాంతినగర్ లో 6 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొడంగల్ మండలంలోని చుట్టూ ప్రక్క గ్రామాల వారు ఎలాంటి నిత్య అవసరాలు ఉన్న కొడంగల్ వచ్చి తీసుకోని వెళ్లేవారు.అలాగే ఏదయినా ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే కొడంగల్ వచ్చేవారు ఇపుడు కొడంగల్ లో కరోనా పాజిటివ్ రావటంతో చుట్టూ ప్రక్క గ్రామా ప్రజలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొడంగల్లో కరోనా పాజిటివ్ రావటంతో ఇది గ్రామాల్లోకి వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రజలకి ఆ గ్రామా సర్పంచ్ లు అవగాహనా కల్పిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews